Advertisement

అల్లు అర్జున్ తో మరో స్టార్ హీరో..!

By: Anji Wed, 16 Sept 2020 7:35 PM

అల్లు అర్జున్ తో మరో స్టార్ హీరో..!

అలావైకుంఠపురం సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్నారు. ఎర్రచందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథకు పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. అల్లు అర్జున్ కు 20వ సినిమా సుకుమార్ కాంబినేషన్ లో మూడవ చిత్రం ఇది... ఈ చిత్రం ద్వారా సుకుమార్ అల్లు అర్జున్ తో హ్యట్రిక్ విజయాన్ని కొట్టాలని చూస్తున్నాడు.. పుష్ప మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగాఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.


కాగా ఈ చిత్రంలో మరో హీరో నారా రోహిత్ నటిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన గుబురు గడ్డంతో దిగిన ఒక ఫోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ గడ్డం బన్నీ మూవీ కోసమే అని వార్తలు వస్తున్నాయి... కాగా సుకుమార్ దర్శకత్వంలో అందరు హీరోలు గుబురు గడ్డంతో కనిపిస్తూ ఉంటారు... పుష్పలో బన్నీ కూడా గడ్డంతో కనిస్తున్నాడు

Tags :

Advertisement