Advertisement

  • అందరూ ఊహించినట్లే అందులోనే రిలీజ్ అవుతున్న న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా

అందరూ ఊహించినట్లే అందులోనే రిలీజ్ అవుతున్న న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా

By: Sankar Thu, 20 Aug 2020 2:13 PM

అందరూ ఊహించినట్లే అందులోనే రిలీజ్ అవుతున్న న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా


అనుకున్న‌ట్టే జ‌రిగింది. కొద్ది రోజులుగా నాని సిల్వ‌ర్ జూబ్లీ చిత్రం వి మూవీ ఓటీటీలో విడుద‌ల కానున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌ర‌గ‌గా, ఇప్పుడు దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌ర్ 5న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుండ‌డం, ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

నాని, సుధీర్ బాబు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వి. ఈ చిత్రంలో నివేదా థామస్ మరియు అదితి రావ్ హైదరీ ఫిమేల్ లీడ్ లో కనిపించనున్నారు. ఇన్నాళ్ళు త‌న కోసం థియేట‌ర్‌కి వచ్చే ప్రేక్షకుల కోసం ఈ సారి త‌నే మీ ఇంటికి వ‌స్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని త‌న‌కి గుర్తుండిపోయేలా చేయాల‌ని నాని పేర్కొన్నాడు. ట‌క్ జ‌గ‌దీష్ మాత్రం త‌ప్ప‌క థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తామ‌ని మాటిచ్చాడు ఈ నేచుర‌ల్ స్టార్.

నాని , ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరియు సుధీర్ బాబు , ఇంద్రగంటి మోహన్ కృష్ణ , మరియు నాని నివేత థామస్ ఇలా ఏ విధంగా చుసిన అన్ని హిట్ కంబినేషన్లు కలిసి ఒకటే సినిమాలో భాగం అవ్వడంతో ఈ సినిమా మీద ముందు ఉంచే భారీ అంచనాలు ఉన్నాయి..అయితే కరోనా లాక్ డౌన్ లేకుంటే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది..అయితే లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడుతూ వచ్చింది ..అయితే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడం , ఒకవేళ అయినా కూడా ఇంతకుముందులాగా జనాలు వచ్చే పరిస్థితులు లేవు మరోవైపు ఓటిటి ప్లాట్ ఫారం లో సినిమాలను చూసేందుకు ప్రెకషకులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు..దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ ఓటిటి వైపు మొగ్గు చూపింది

Tags :
|
|
|

Advertisement