Advertisement

  • టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని

టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని

By: Sankar Fri, 18 Dec 2020 7:05 PM

టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని


వరుసగా విజయాలతో దూసుకుపోతున్న నాని కు వి సినిమా రూపంలో ప్లాప్ ఎదురయింది..దీనితో తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు నాని..తనకు నిన్ను కోరి వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ తో టాక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు..

నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు..కాగా, ‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫ‌స్ట్ లుక్‌ను క్రిస్మస్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని త‌న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హీరో నాని ప్రక‌టించారు. శుక్రవారం ఆయ‌న ‘ట‌క్ జ‌గ‌దీష్‌’కు సంబంధించిన ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో రోట్లో పప్పు దంచుతున్న ఓ స్త్రీ చేయి క‌నిపిస్తోంది.ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌. త‌మ‌న్ స్వరాలు కూరుస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు..

Tags :
|

Advertisement