Advertisement

  • కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నాని కొత్త సినిమా...

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నాని కొత్త సినిమా...

By: Sankar Sun, 08 Nov 2020 4:17 PM

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నాని కొత్త సినిమా...


యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు.

వాటిలో శామ్ సింగరాయ ఒకటి. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కృతి శెట్టి కనిపించనుంది. ఇక ఈ సినిమా కలకత్తా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు చిత్రయూనిట్ అక్కడకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశం లేదు.

దాంతో హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కలకత్తా సెట్టింగ్ లో సినిమాను షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా కంటే ముందు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాను వచ్చే ఏడాది దసరా సీజన్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Tags :
|

Advertisement