Advertisement

  • కొత్త సినిమా షురూ చేసిన నాచురల్ స్టార్ నాని...

కొత్త సినిమా షురూ చేసిన నాచురల్ స్టార్ నాని...

By: Sankar Thu, 10 Dec 2020 5:49 PM

కొత్త సినిమా షురూ చేసిన నాచురల్ స్టార్ నాని...


నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాను షురూ చేసాడు...ఇప్పటికే ఈ ఏడాది వి సినిమాతో అభిమానులను పలకరించిన నాని మరొక సినిమాను పట్టాలెక్కించాడు...ఈ మూవీ ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభం అయింది

శ్యామ్ సింగరాయ్’ పేరుతో తెర కెక్కిస్తున్న ఈ మూవీకి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్‌ కొట్టారు. నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా, నాని తండ్రితో క్లాప్ కొట్టించడం విశేషం. రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలను ఈ నెలలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో నాని నటిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు...

Tags :
|

Advertisement