Advertisement

  • న్యాచురల్ స్టార్ నాని ‘వి’ ట్రైలర్ విడుదల

న్యాచురల్ స్టార్ నాని ‘వి’ ట్రైలర్ విడుదల

By: Sankar Wed, 26 Aug 2020 5:20 PM

న్యాచురల్ స్టార్ నాని ‘వి’ ట్రైలర్ విడుదల


ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కలిసి నటిస్తున్న ‘వి’ సిన్మా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ”ఎలా ఫినిష్ చేద్దాం” అంటూ ఈ చిత్రంలో ఉన్న ఓ డైలాగ్ ను గుర్తుచేస్తూ నాని తన ట్విట్టర్ ట్రైలర్ ద్వారా రిలీజ్ చేశాడు.

ఈ చిత్రంలో నివేదా థామస్‌, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధీర్‌బాబు పోలీసుగా ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దిల్‌ రాజు బ్యానర్లో నిర్మిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను సినిమా థియేటర్లలో రిలీజ్ చేయాలి అని చూసారు కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు అన్ని మూత పడ్డాయి..అయితే కరోనా లాక్ డౌన్ కంటే ముందే సినిమా పూర్తి అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది..అయితే ఇప్పట్లో హాళ్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసందుకే నిర్మాతలు మొగ్గు చూపారు

Tags :
|
|

Advertisement