Advertisement

  • బాలకృష్ణ – బోయపాటి సినిమాకు టైటిల్ కరారు...?

బాలకృష్ణ – బోయపాటి సినిమాకు టైటిల్ కరారు...?

By: Anji Sun, 13 Dec 2020 1:40 PM

బాలకృష్ణ – బోయపాటి సినిమాకు టైటిల్ కరారు...?

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా..కరోనా వచ్చి బ్రేక్ ఇచ్చింది.

తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో షూటింగ్ పున: ప్రారంభం అయ్యింది. కాగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట.

ఎలాగూ 2021 జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతోంది. అందుకే బాలయ్య ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ కు పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇక ఈ సినిమా టైటిల్‌ పై అనేక రూమర్స్ వచ్చినా, ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని టాక్‌. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Tags :

Advertisement