Advertisement

  • కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి సెకండ్ లుక్ విడుదల

కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి సెకండ్ లుక్ విడుదల

By: Sankar Sat, 29 Aug 2020 2:32 PM

కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి సెకండ్ లుక్ విడుదల


టాలీవుడ్ కింగ్ , మన్మధుడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్‌ లుక్‌ని విడుదల చేశారు. నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు.

తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఎన్ ఐ ఏ ఏజెంట్‌గా.. హీరోయిన్ ఆర్య పండిండ్ రా స్పెషల్ ఏజెంట్‌గా కనిపిస్తున్నారు. త్వరలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందిన నాగార్జున , అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా తెరంగేట్రం చేసాడు..తొలుత సినిమాలు అంతగా ఆడకపోయినప్పటికీ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది..ఇక అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుసగా హిట్ సినిమాలతో టాలీవుడ్ కింగ్ గా మారారు ఈ మన్మధుడు..

Tags :
|

Advertisement