Advertisement

ఆ విషయంలో సీనియర్ హీరోలలో నాగార్జున టాప్

By: Sankar Wed, 17 June 2020 8:52 PM

ఆ విషయంలో సీనియర్ హీరోలలో నాగార్జున టాప్




టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలసిందే. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. గత పదేళ్లుగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను మెయింటైన్ చేస్తున్నారు. అయితే, ఈ పదేళ్లలో ట్విట్టర్‌లో నాగార్జున ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సంఖ్య 60 లక్షలు (6 మిలియన్) దాటింది. కింగ్ నాగార్జున 6 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను దాటడంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, తెలుగులో 6 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను అందుకున్న టాలీవుడ్ స్టార్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. హీరోల్లో 9.8 మిలియన్ ఫాలోవర్స్‌తో మహేష్ అగ్రస్థానంలో ఉన్నారు. రానా దగ్గుబాటికి కూడా 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళికి 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మిగిలిన స్టార్ హీరోలు ఎవరికీ 5 మిలియన్ ఫాలోవర్స్ లేరు. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే నాగార్జునదే అగ్రస్థానం. మొత్తం మీద ఈ సీనియర్ మన్మథుడు ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.

ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరవాత ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు నాగార్జున. ఇది యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం.

Tags :

Advertisement