Advertisement

  • లవకుశ సినిమాలో లవ పాత్రలో నటించిన నాగరాజు కన్నుమూత

లవకుశ సినిమాలో లవ పాత్రలో నటించిన నాగరాజు కన్నుమూత

By: Sankar Mon, 07 Sept 2020 2:23 PM

లవకుశ సినిమాలో లవ పాత్రలో నటించిన నాగరాజు కన్నుమూత


తెలుగు క్లాసికల్ మూవీలో ఎప్పుడు ప్రత్యేక స్థానంలో నిలిచే సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించిన లవ కుశ నిలిచిపోతుంది..ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటన నభూతో అన్న స్థాయిలో ఉంటుంది..అయితే ఇందులో ఎన్టీఆర్ ఎంత స్థాయిలో నటించారో అదే స్థాయిలో ఒక ఇద్దరు పిల్లలు లవ కుశులుగా మెప్పించారు..వారి హావ భావాలతో ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేశారు. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. వారు పెరిగి పెద్దవారయినప్పటకీ లవ, కుశలుగానే అందరి చేత గుర్తింపు పొందారు.

లవకుశ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడి పెరుగు నాగరాజు. అమ్మమీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండు కలగలిపిన పాత్ర లవడుది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆ సినిమాలో రాముడి పాత్ర పోషించగా ఆయననే ఎదిరించి యుద్దం చేస్తారు మన లవకుశలు.

ఆ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణం పట్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు, ‘లవకుశ’ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :
|
|

Advertisement