Advertisement

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగ‌బాబు

By: chandrasekar Fri, 29 May 2020 5:59 PM

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగ‌బాబు


టాలీవుడ్ అగ్ర‌హీరో, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి బామ్మ‌ర్ది అయిన నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాగ‌బాబు త‌న సొంత యూట్యూబ్ చాన‌ల్‌లో చేసిన వీడియోలో బాల‌కృష్ణ‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయితే ఈ వీడియోకు త‌నదే సొంత బాధ్య‌త అని మొట్ట మొద‌టే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల గాంధీజీ, నాథూరాం గాడ్సేల‌పై నాగ‌బాబు ట్వీట్స్ వివాదాస్ప‌దం కావ‌డం, వాటితో జ‌న‌సేన‌కు సంబంధం లేద‌ని జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నేపథ్యంలో నాగ‌బాబు అప్ర‌మ‌త్త‌మైన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. మాట్లాడేట‌ప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని బాల‌కృష్ణ‌కు నాగ‌బాబు హిత‌వు ప‌లికాడు. అంతేకాదు, ఇండ‌స్ట్రీకి నువ్వేం కింగ్ కాద‌ని బాల‌య్య‌ను హెచ్చ‌రించాడు. కేవ‌లం నువ్వొక హీరోవి మాత్ర‌మే అని బాల‌య్య స్థాయి ఏంటో నాగ‌బాబు తేల్చి చెప్పాడు. 5.34 నిమిషాలున్న ఆ వీడియో తీవ్ర సంచ‌ల‌నానికి, టాలీవుడ్‌లో మ‌రో వివాదానికి తెర‌దీస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అస‌లు ఆ వీడియోలో నాగ‌బాబు ఏం మాట్లాడారో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న పేద కార్మికుల‌ను ఆదుకునేందుకు ఇండ‌స్ట్రీలోని వారంద‌రూ త‌లా ఒక చేయి వేశారు. చాలా హ్యాపీగా ఉంది. అయితే సినిమా, టీవీ షూటింగ్స్‌కు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో చిరంజీవి గారింట్లో నాగార్జున‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, రాజ‌మౌళి, అర‌వింద్‌, సురేష్‌బాబు, సి.క‌ల్యాణ్ ఇంకా చాలా మంది పెద్ద నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పాల్గొన్నారు. వీరే కాకుండా నాకు స‌రిగ్గా పేర్లు కూడా తెలియ‌ని వారంతా క‌లుసుకున్నారు. ఒక లిమిటెడ్ గ్యాద‌రింగ్‌ను చేశారు. అది ఎట్లా జ‌రిగిందో, ఆ నేప‌థ్యం ఏంటో నాకు తెలియ‌దు. శ్రీ‌నివాస్ యాద‌వే చిరంజీవి ఇంట్లో క‌లుద్దామ‌న్నాడా లేక మ‌రేదైనా కార‌ణ‌మా అనే విష‌యం నాకు తెలియ‌దు.

న‌టుడు బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌ల‌ను విన్నాను. ఆయ‌న్ను పిల‌వ‌డం, పిల‌వ‌క‌పోవ‌డం అనేది రైటా రాంగా నాకు తెలియ‌దు. అయితే ఎవ‌రో అడిగితే త‌న‌ను పిల‌వ‌లేద‌ని బాల‌కృష్ణ కోప్ప‌డం త‌ప్పు ప‌ట్టాల్సిందేమీ లేదు. అలా కోప్ప‌డ‌డంలో రీజ‌న్ ఉంది. కానీ నోరు జారి అంద‌రూ క‌లిసి భూములు పంచుకుంటున్నార‌ని, మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి ఏదో బూతు మాట్లాడితే బీప్ వేశారు. అంటే మిమ్మల్ని పిల‌వ‌క‌పోవ‌డం రైట్ అని నేను అన‌ను. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ అయి ఉండొచ్చు. కానీ భూములు పంచుకుంటు న్నార‌ని మీరు ఉక్రోషంగా మాట్లాడిన మాట ఒక ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా, ఆర్టిస్ట్ గా నాకు బాధ క‌లిగించింది.

nagababu,given,strong,warning,balakrishna ,స్ట్రాంగ్, వార్నింగ్, ఇచ్చిన, నాగ‌బాబు, టాలీవుడ్


నోటికి ఎంతొస్తే అంత మాట్లాడ్డం క‌రెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడ్తానంటే అంత‌కంటే ప‌ది రెట్లు మాట్లాడ‌టానికి చాలా మంది రెడీగా ఉన్నారు. నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. ఇండ‌స్ట్రీ బాగు కోసం ప‌ని చేయ‌డానికే త‌ప్ప భూములు పంచుకోడానికి ఎవ‌రూ వెళ్ల‌లేదు. మాతో పాటు చాలా మందిని పిల‌వ‌లేదు.

భూములు పంచుకోడానికి వెళ్లార‌నే మాట‌లు ఏంటి? ఇదా ఇండ‌స్ట్రీపై మీకున్న గౌర‌వం? చాలా త‌ప్పుగా మాట్టాడారు. అలాగే మీరు మాట్లాడిన ఇంకో త‌ప్పు మాట ఏంటంటే మీరు కేవ‌లం చిత్ర ప‌రిశ్ర‌మ‌ను మాత్ర‌మే కాదు, తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూడా అవ‌మానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా ఇండస్ట్రీ వాళ్ల‌కు భూముల పందేరం చేయ‌డానికి పిలిచిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? క‌చ్చితంగా మీరు ఇండ‌స్ట్రీకి, టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ చెప్పి, ఆ త‌ర్వాత ఏదైనా చేయండి. అది మీ బాధ్య‌త‌. క్ష‌మాప‌ణ చెప్పాల్సిన బాధ్య‌త మీకు ఉంది.

ఇంకెప్పుడు అలాంటి త‌ప్పుడు మాట మాట్లాడ‌కండి. ఇక్క‌డెవ‌రూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డానికి లేరు. ఎవ‌రు చేశారో ఒక‌సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళితే తెలుస్తుంది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఎలా నాశ‌నం చేశారో , సామాన్యుల జీవితాలు ఎలా స‌ర్వ‌నాశ‌న‌మ‌య్యాయో తెలుస్తుంది.

మీ తెలుగుదేశం పార్టీని న‌మ్మితే ఏమైందో తెలుస్తుంది. మీరేం మాట్లాడినా నోరు మూసుకోడానికి ఎవ‌రూ సిద్ధంగా లేరు. ఇండ‌స్ట్రీకి మీరేమీ కింగ్ కాదు. జ‌స్ట్ వ‌న్ హీరో ద‌ట్సాల్‌. మాట‌లు కంట్రోల్‌గా మాట్లాడ్డం నేర్చుకోండి" అంటూ నాగ‌బాబు త‌న అభిప్రాయాల్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తేల్చి చెప్పారు. నాగ‌బాబు సీరియ‌స్ వార్నింగ్‌పై బాల‌కృష్ణ లేదా ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఏ విధంగా స్పందిస్తారోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. కేవ‌లం నువ్వొక హీరోవి మాత్ర‌మే అని బాల‌కృష్ణ‌నుద్దేశించి నాగ‌బాబు అన‌డం కాసింత నిప్పు రాజేసేలా ఉంది.

Tags :
|
|

Advertisement