Advertisement

నాగచైతన్య లవ్ స్టొరీ టీజర్ తేదీ ఇదే!

By: Anji Mon, 14 Sept 2020 5:52 PM

నాగచైతన్య లవ్ స్టొరీ టీజర్ తేదీ ఇదే!

సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు జనాలకు బాగా దగ్గరైంది. ఈ హై బ్రీడ్ పిల్ల సినిమాలకు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు మంచి కాంబినేషన్ ఉన్న దర్శకుడు హీరో సెట్టయితే చెప్పేదేముంది. బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లు దక్కడం కామన్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమాలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్ లోనే లాస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేయనున్నారు. ఇక సినిమా టీజర్ ని నాగచైతన్య బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు. గతంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ స్పెషల్ పోస్టర్స్ అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాల డోస్ ని మరింత పెంచాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు గతంలో కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ మాత్రం అలాంటి ఆలోచనలో లేనట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాతనే రిలీజ్ డేట్ గురించి ఆలోచించాలని చిత్ర నిర్మాతలు ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

Tags :

Advertisement