Advertisement

  • మ్యూజిక్ స్కూల్ పెట్టడం నా డ్రీం అని అన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

మ్యూజిక్ స్కూల్ పెట్టడం నా డ్రీం అని అన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

By: Sankar Sun, 26 July 2020 8:26 PM

మ్యూజిక్ స్కూల్ పెట్టడం నా డ్రీం అని అన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్



థ‌మ‌న్ మ్యూజిక్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారెవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఏడాది థ‌మ‌న్ సంగీతం అందించిన అల వైకుంఠ‌పురంలో చిత్రంలోని పాటలు ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ హిట్స్ గా నిలుస్తాయి. థ‌మ‌న్ మ్యూజిక్ కు డేవిడ్ వార్న‌ర్ సైతం ఇంప్రెస్ అయ్యాడంటే..అత‌ని స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం బిజీగా ఉన్న టాలీవుడ్ కంపోజ‌ర్ల‌లో థ‌మ‌న్ ఒక‌డు. మ‌హేశ్‌బాబు, ప‌రశురాం కాంబోలో వ‌స్తోన్న స‌ర్కారు వారి పాట‌కు ఈ యువ సెన్సేష‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్. అయితే ప్ర‌తీ ఒక్క‌రికీ బ‌ల‌మైన కోరిక ఒక‌టి ఉంటుంది మ‌రి. థ‌మ‌న్ కు కూడా అలాంటిదే ఓ కోరిక ఉంద‌ట‌.

మ్యూజిక్ స్కూల్ ను స్థాపించాల‌నేది థ‌మ‌న్ క‌ల అట‌. తాను 50 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే నాటికి ఈ మ్యూజిక్ స్కూల్ నిర్వ‌హించుకునేలా ఉండాల‌ని థ‌మ‌న్ కు ప్లాన్ ఉందని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే మ్యూజిక్ స్కూల్ ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో కాకుండా కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హించే విధంగా..ఆస‌క్తి ఉన్న చిన్నారుల‌ను ఉచితంగా సంగీతంలొ మెల‌కువ‌లు నేర్పాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. ఏది ఏమైనా థ‌మ‌న్ ఆలోచ‌న‌ను అంద‌రూ మెచ్చుకోవాల్సిందే.

Tags :
|
|
|

Advertisement