Advertisement

పవన్ కళ్యాణ్, రవితేజతో మల్టీస్టారర్ మూవీ

By: chandrasekar Wed, 22 July 2020 1:52 PM

పవన్ కళ్యాణ్, రవితేజతో మల్టీస్టారర్ మూవీ


పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమా గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. పవర్ స్టార్ట్ అభిమానులను సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి మూవీ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ డైరక్షన్‌లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ "పింక్‌" సినిమాకు తెలుగు వర్షన్ అయిన ఈ మూవీలో అంజలి, నివేద థామస్, అనన్య నటిస్తున్నారు.

మూవీకి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వకీస్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రానికి గజదొంగ, బందిపోటు, విరూపాక్షి అనే టైటిల్స్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారట. ఈ సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది అని సమాచారం.

పవన్‌తో గతంలో కాటమరాయుడు, గోపాల గోపాల వంటి చిత్రాలు తెరకెక్కించిన డాలి మూవీని తీయనున్నాడని సమాచారం. ఒక తమిళ సినిమా ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని త్వరలో పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Tags :
|
|

Advertisement