Advertisement

  • పవన్ కళ్యాణ్ మరియు సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా

పవన్ కళ్యాణ్ మరియు సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా

By: chandrasekar Thu, 03 Sept 2020 09:44 AM

పవన్ కళ్యాణ్ మరియు సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా


అసెంబ్లీ ఎలక్షన్ తరువాత అనతి కాలంలో సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత పింక్ రీమేక్ చిత్రం వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌ని లైన్‌లో పెట్టారు. ఇప్ప‌టికే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌కీల్ సాబ్ అనే సినిమాని చేస్తుండ‌గా, అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ పై ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తున్నారు.

ఇక త‌న 27వ చిత్రంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా, 28వ చిత్రంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుంద‌ని ప‌వ‌న్ కళ్యాణ్ ప్రకటించాడు. గ‌త కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త విన్న తన అభిమానులు చాలా సంతోషాన్ని వెలిబుచ్చారు.

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ పవన్ - సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నే దానిపై క్లారిటీ లేదు.

Tags :
|
|

Advertisement