Advertisement

  • కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెదరాయుడు సినిమాకు 25 ఏళ్ళు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెదరాయుడు సినిమాకు 25 ఏళ్ళు

By: Sankar Mon, 15 June 2020 12:12 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెదరాయుడు సినిమాకు 25  ఏళ్ళు



పెదరాయుడు అప్పట్లో బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి 1995లో పెదరాయుడు సినిమాను విడుదల చేశారు. అప్పట్లో అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ‘నాట్టమై’ అనే విజయవంతమైన తమిళ సినిమాకు రిమేక్. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో నటించారు. అయితే తాజాగా పెదరాయుడు సినిమాకు 25 ఏళ్లు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా మోహన్ బాబు అప్పటి వీడియో ఒకటి షేర్ చేశారు. పెదరాయుడు సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టే వీడియోను ఆయన సోషల్ మీడయాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అప్పటి వీడియోలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, నందమూరి తారక రామారావు, నిర్మాత రామానాయుడు, అక్కినేని నాగేశ్వర్రావుతో పాటు.. రజనీకాంత్ కూడా ఉన్నారు.

ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి పెదరాయుడు సినిమా ముహుర్తం వేడుకకు వచ్చారు. మోహన్ బాబు వెన్నుతట్టిన ఎన్టీఆర్.. సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు వచ్చిన దాసరి, ఎన్టీఆర్ కాళ్లపై పడి మోహన్ బాబు ఆశీర్వాదాలు తీసుకున్నారు. రజనీ కూడా మోహన్ బాబు కాళ్లపై పడి ఆయన్ని ఆట పట్టించారు. ఇక రజనీ.. మోహన్ బాబు మెడలో దండవేసిన సీన్ తీశారు. మోహన్ బాబు, ఎన్టీఆర్ సతీమణితో కలిసి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఇక దాసరి కూడా కొబ్బరికాయ కొట్టారు.

Tags :

Advertisement