Advertisement

  • మెగాస్టార్ చిరంజీవి లూసిఫెర్ రీమేక్ కు దర్శకుడు దొరికేసాడు

మెగాస్టార్ చిరంజీవి లూసిఫెర్ రీమేక్ కు దర్శకుడు దొరికేసాడు

By: Sankar Wed, 16 Dec 2020 5:56 PM

మెగాస్టార్ చిరంజీవి లూసిఫెర్ రీమేక్ కు దర్శకుడు దొరికేసాడు


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫెర్ మూవీ ఏ స్థాయి విజయం సాధించిందో అందరికి తెలిసిందే..లూసిఫెర్ పాత్రలో మోహన్ లాల్ అద్భుత ప్రతిభను కనబరిచాడు ..ఇక తెలుగు లో ఆ సినిమా మెగా స్టార్ చేస్తే బాగుంటుంది అని అయన అభిమానులు ఆశించారు ..వారి ఆశలను నిజం చేస్తూ మెగాస్టార్ లూసిఫెర్ రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు..

అయితే ఇప్పటివరకు ఆ రీమేక్ కోసం డైరెక్టర్ ను ఎంపిక చేయలేదు..తాజాగా ఈ సినిమాకి దర్శకుడిని ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో తని ఒరువన్ మూవీ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మోహన్ రాజాను ఈ సినిమా కు డైరెక్టర్ గ మెగాస్టార్ ఎంపిక చేసారు..

ఈ క్రమములో చిరంజీవి మాట్లాడుతూ .. ‘ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ కెళ‌తాం. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది’ అని చిరు తెలిపారు.

ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన హిట్ల‌ర్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. ఇప్పుడు ఆయ‌న‌ను డైరెక్ట్ చేసే అదృష్టం ద‌క్క‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం. ఈ అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపాడు.

Tags :
|

Advertisement