Advertisement

  • ‘కడలి’ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి అప్పటి జ్ఞాపకాలు

‘కడలి’ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి అప్పటి జ్ఞాపకాలు

By: chandrasekar Mon, 13 July 2020 1:43 PM

‘కడలి’ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి అప్పటి జ్ఞాపకాలు


మణిరత్నం గారు ఇచ్చిన డైటింగ్‌ ప్లాన్‌తో బరవు తగ్గాను అని చెప్పారు ప్రముఖ నటుడు అరవింద్‌స్వామి. ‘ఓ రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంతో బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో 110 కిలోల బరువు పెరిగాను. కోలుకున్న తర్వాత దర్శకుడు మణిరత్నం గారు ఇచ్చిన సలహాలతో బరువు తగ్గాను.' అని అరవిందస్వామి అన్నారు.

'కడలి’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటి విశేషాల గురించి చెప్పుకొచ్చాడు. మణిరత్నం గారు ‘కడలి’ పాత్ర గురించి చెప్పగానే మళ్లీ సినిమాల్లో నటించడం సాధ్యమైన పని కాదని చెప్పాను. కానీ ఆయన పట్టువదలకుండా నాతో వర్కవుట్స్‌, డైటింగ్‌ చేయించారు.

సినిమా గురించి కాకపోయినా ఆరోగ్యం కోసమైనా ఉపయోగపడుతుందని అని చెప్పి డైటింగ్‌ ప్లాన్‌ చేయించి నాతో మొదలుపెట్టించారు. ఆహారాన్ని రోజుకు ఎక్కువసార్లు కొద్ది కొద్దిగా తీసుకోవడం, వాకింగ్‌ చేయడం మొదలుపెట్టాను. కొద్దిరోజులకే నాలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యమేసింది.

దాదాపు 20 కిలోల బరువు తగ్గాను. నన్నుచూడగానే మణిరత్నం గారు పాత్రకు సరిపోతావని చెప్పి నాతో సినిమాలో చేయించారు. అలా సినిమాల్లో నా రెండో ఇన్నిం గ్స్‌ ప్రారంభమైంది ’ అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు అరవింద్‌ స్వామి.

Tags :

Advertisement