Advertisement

  • సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ ట్వీట్ చేసిన మెగాస్టార్

సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ ట్వీట్ చేసిన మెగాస్టార్

By: chandrasekar Mon, 10 Aug 2020 2:38 PM

సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ ట్వీట్ చేసిన మెగాస్టార్


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన‌రోజుకు బర్త్ డే విషెస్ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి. సూపర్ స్టార్ మహేష్ బాబు 45వ పుట్టిన‌రోజు ఆగస్టు 9 సందర్భంగా సోషల్ మీడియా అంతా మహేష్ మేనియాతో హోరెత్తిపోతోంది. ఆయ‌న‌కు పలువురు సినీ సెల‌బ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బర్త్ డే పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వీట్ విషెస్ తెలుపుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు.

పుట్టిన‌రోజు సందర్భంగా 'అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాది మీకు అద్భుత విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోతూ మెగాస్టార్‌కి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు.

మరోవైపు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ దర్శకనిర్మాతలు మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అట్రాక్ట్ చేశారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలియజేసారు.

Tags :

Advertisement