Advertisement

'ఆచార్య' రిలీజ్ తేదీ..!

By: Anji Sun, 30 Aug 2020 2:14 PM

'ఆచార్య' రిలీజ్ తేదీ..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' రిలీజ్ తేదీని నిర్మాతలు ఫిక్స్ చేసేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, లాక్ డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారట. ఏప్రిల్ 9కి, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు 'ఆచార్య'ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై, నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల తేదీ విషయంలో ఏ మేరకు వాస్తవం ఉందన్న సంగతి తెలియాలంటే నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ స్పందించాల్సిందే.

Tags :

Advertisement