Advertisement

  • భాయ్ మీ అనారోగ్య వార్త నన్ను కలిచివేస్తుంది ..సంజయ్ దత్ ఆరోగ్యపరిస్థితిపై చిరంజీవి ట్వీట్

భాయ్ మీ అనారోగ్య వార్త నన్ను కలిచివేస్తుంది ..సంజయ్ దత్ ఆరోగ్యపరిస్థితిపై చిరంజీవి ట్వీట్

By: Sankar Wed, 12 Aug 2020 9:34 PM

భాయ్ మీ అనారోగ్య వార్త నన్ను కలిచివేస్తుంది ..సంజయ్ దత్ ఆరోగ్యపరిస్థితిపై చిరంజీవి ట్వీట్



బాలీవుడ్ సనీయర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 3వ స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. ఆనంతరం ఆయన నిన్న ముంబై ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన ఈ వ్యాధి నుంచి బయటపడాలని ఆశిస్తూ సోషల్‌ మీడియాలో వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై చలిస్తూ ట్వీట్‌ చేశాడు..

‘డియర్‌ సంజయ్‌ భాయ్‌... మీరు ఇంతటి అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. కానీ మీరు ఓ ఫైటర్‌. ఎన్నో ఏళ్లుగా అనేక ఓడిదుడుగులను చుశారు. వాటిని మీరు అధిగమించారు కూడా. అలాగే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కూడా త్వరలో కోలుకుంటారనండంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యాధి నుంచి కూడా తప్పక బయటపడతారని ఆశిస్తున్నాను. మీరు త్వరలో కోలుకోని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ మెగాస్టార్‌ ట్వీట్‌ చేశాడు

కాగా సంజయ్ దత్ హిందీ లో చేసిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ , లగేరహో మున్నాభాయ్ సినిమాలను తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ , శంకర్ దాదా జిందాబాద్ పేర్లతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే ..ఈ సిఎంమాలు అటు బాలీవుడ్ లో , ఇటుటాలీవుడ్ లో మంచి విజయాలు సాధించాయి

Tags :
|

Advertisement