Advertisement

  • 'బ్లఫ్ మాస్టర్' సినిమా చూసి దర్శకుడిని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి..

'బ్లఫ్ మాస్టర్' సినిమా చూసి దర్శకుడిని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి..

By: Sankar Sun, 19 July 2020 8:01 PM

'బ్లఫ్ మాస్టర్' సినిమా చూసి దర్శకుడిని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి..



ఇటీవల కాలంలో ఒక సినిమా నచ్చితే దాని మీద ప్రశంసలు కురిపించడానికి మిగిలిన హీరోలు ఏ మాత్రం వెనుకాడటం లేదు ..అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటివాళ్ల నుంచి ప్రశంసలు కురిపిస్తే ఇక అంతకంటే ఎం కావాలి ..అదే అదృష్టం బ్లఫ్ మాస్టర్ సినిమాకు దక్కింది ..సత్యదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా గోపీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కింది..

ఈ సినిమా లో నటించిన సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది ..అయితే ఈ సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చూశారు.ఈ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో దర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలుపించుకుని అభినందించారు. ఈ విషయాన్ని గోపి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘విశాల హృదయుడు అయిన మెగాస్టార్ నా ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను చూశారు. నన్ను ఇంటికి పిలిచి అభినందించారు. సినిమా చూసి, నన్ను ప్రశంసించినందుకు ప్రియమైన చిరు సార్‌కి ధన్యవాదాలు. విశాల హృదయం కలవారు మాత్రమే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు విశాల హృదయులు. నా గురించి మీరు చెప్పిన మాటలు ఎప్పటికీ నా హృదయంలో పదిలంగా ఉంటాయి. థాంక్యూ సార్’’ అని గోపి ట్వీట్‌లో పేర్కొన్నారు..


Tags :
|

Advertisement