Advertisement

చిరంజీవి ‘ఆచార్య’ కొరటాలదే..!

By: Anji Fri, 28 Aug 2020 07:37 AM

చిరంజీవి ‘ఆచార్య’ కొరటాలదే..!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ ‘ఆచార్య’ ఈ కథ నాదే అంటూ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన కొందరు రచయితలు చేస్తున్న ఆరోపణలను నిర్మాణ సంస్థ ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ కొట్టిపడేసింది. ‘‘ఆచార్య పూర్తిగా కొరటాల శివ సొంత కథ. మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్టు రెండేళ్లు కష్టపడి రాసుకున్నారు.

కొంతమంది రచయితలు ‘ఆచార్య’ చిత్రకథ తమదే అంటూ చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవి. కొరటాల శివలాంటి పేరున్న దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. కొన్ని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి వస్తున్న రూమర్‌ స్టోరీలను ఆధారంగా చేసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

ఇవన్నీ ఎవరికి వారు ఊహించుకున్నవే. చిత్రీకరణ జరుగుతుండడం వల్ల కథను రహస్యంగా ఉంచాము. కొద్దిమందికి మాత్రమే కథపై అవగాహన ఉంది. ‘ఆచార్య’ స్టోరీ కాపీ అంటూ వస్తోన్న ఆరోపణలు అర్దరహితం. నిరాధారం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Advertisement