Advertisement

  • మెగాస్టార్ ఆచార్య ఫస్ట్‌ లుక్‌ అదిరింది - అభిమానులు ఫిదా

మెగాస్టార్ ఆచార్య ఫస్ట్‌ లుక్‌ అదిరింది - అభిమానులు ఫిదా

By: Dimple Sat, 22 Aug 2020 4:33 PM

మెగాస్టార్ ఆచార్య ఫస్ట్‌ లుక్‌ అదిరింది - అభిమానులు ఫిదా

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరంజీవి 152వ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. అభిమానులు ఫిదా అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అభిమానులకు గూస్‌ బంప్స్‌ తెప్పించారు. ధర్మస్థలి ప్రాంతాన్ని చూపిస్తూ.. అక్కడ రైతులతో చిరంజీవి నిల్చున్నట్లు మోషన్‌ పోస్టర్లో చూపించారు. సినిపేరునుకూడా ఆచార్య టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 2021 వేసవి సమయంలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.

నిజానికి ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు. ఓ సందర్భంలో సినిమా ఈవెంట్‌లో చిరంజీవి పొరపాటున నోరుజారారు. అప్పటి నుంచీ ‘ఆచార్య’ టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. అయినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం #CHIRU152 గానే పిలుస్తోంది. అంటే, ఆగస్టు 22న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే చిరంజీవి లుక్, టైటిల్ లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ సినిమాకు మెలోడి మాంత్రికుడు మణిశర్మ సంగీత స్వరాలను అందిస్తున్నారు.

Tags :

Advertisement