Advertisement

  • మరొక మెగా హీరోకి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో మెగా అభిమానులు

మరొక మెగా హీరోకి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో మెగా అభిమానులు

By: Sankar Tue, 29 Dec 2020 4:45 PM

మరొక మెగా హీరోకి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో మెగా అభిమానులు


కరోనా మహమ్మారి సినీ ప్రముఖులను వదలడం లేదు...తాజాగా ఈ రోజు పొద్దున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడినట్లు ప్రకటించగా , తాజాగా ఇప్పుడు మరొక హీరో కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపాడు...వరుణ్ తేజ్ కు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

ఈ విష‌యాన్ని వరుణ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. హోమ్ క్వారంటైన్ పాటిస్తూ మందులు వాడుతున్నని తెలిపాడు. అయితే తనతో టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు.అయితే క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఇంటికి మెగా ఫ్యామిలీని ఆహ్వానించ‌గా, ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌లో సంతోషంగా పాల్గొన్నారు.

స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈ వేడుక‌లో పాల్గొన్న వారంద‌రు చ‌ర‌ణ్‌కు స‌న్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు.అయితే ఇప్పుడు చరణ్ , వరుణ్ తేజ్ లకు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా వారు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు..

Tags :
|
|

Advertisement