Advertisement

  • నిహారిక ప్రీ వెడ్డింగ్ లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్ లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ

By: Sankar Thu, 03 Dec 2020 12:15 PM

నిహారిక ప్రీ వెడ్డింగ్ లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ


మెగా కుటుంబంలో పెళ్ళో బాజాలు మోగాయి ..మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి..తాజాగా ఈ వేడుకకోసం కుటుంబంలోని వారంతా కలిసారు.

ప్రతి ఒక్కరు తమతమ ఉద్యోగాలకు సెలవులు పెట్టుకొని మరీ వచ్చారు. పవర్ స్టార్ పవన్‌కూడా తన సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇటీవల జరిగిన నాహారికా-చైతన్యల ప్రీ వెడ్డింగ్‌కు మెగా కసిన్స్ అందరూ హాజరయ్యారు. దీనికి దాదాపు అందరూ హాజరయినప్పటికి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, రామ్ చరణ్‌లు తమతమ బిజీ షెడ్యూల్ల కారణంగా రాలేక పోయారు. ఇత అందరూ వచ్చి వీరిని విష్ చేశారు.

వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, అల్లు స్నేహా రెడ్డి, అల్లు బాబీ ఇలా చెప్పుకుంటూ పోతే భారీ లిస్టే వస్తుంది. వీరి వెడ్డింగ్ అతిథులతో, ఫ్రెండ్స్‌తో చాలా జోరుగా సాగింది. ఈ ఫొటోలను నిహారికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. వాటితో పాటుగా మెగా డాటర్ తన కౌంట్‌డౌన్ మొదలు చేసింది.

Tags :

Advertisement