Advertisement

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు షురూ

By: Sankar Tue, 18 Aug 2020 08:40 AM

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు షురూ


మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు మొదలయ్యాయి..ఇటీవలే కృష్ణ చైతన్య తో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే . ఈ వేడుక‌కి పవ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప మెగా ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు హాజ‌ర‌య్యారు. వేడుక‌కి సంబంధించిన వీడియోని నాగ‌బాబు త‌న యూట్యూబ్‌లో విడుద‌ల చేసి నెటిజ‌న్స్‌కి ఆనందాన్ని అందించారు.

నిశ్చితార్ధ వేడుక‌లో ఇరువురు ఉంగరాలు మార్చుకోవ‌డం, కుటుంబ స‌భ్యులు తాంబూలాలు మార్చుకోవ‌డంతో వివాహా క్రతువుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఘట్టం పూర్తైయింది. ఇక ఈ నెల‌లోనే నిహారిక పెళ్ళి ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, పెళ్ళి ప‌నుల‌లో ముఖ్య‌మైన ప‌సుపు దంచే కార్య‌క్ర‌మం సోమవారం నిర్వ‌హించారు.

ఇందులో నిహారిక అక్క చెల్లెళ్లు, తోడి కోడ‌ళ్ళు, అత్త‌లు అంద‌రు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌తో పెళ్ళి ప‌నులు మ‌రింత ఊపందుకోనున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ప‌సుపు దంచే కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియోని నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, అది వైర‌ల్ అయింది

Tags :
|
|

Advertisement