Advertisement

  • తిరుపతి శ్రీవారి సన్నధిలో నిహారిక దంపతులు...!

తిరుపతి శ్రీవారి సన్నధిలో నిహారిక దంపతులు...!

By: Anji Mon, 14 Dec 2020 3:55 PM

తిరుపతి శ్రీవారి సన్నధిలో నిహారిక దంపతులు...!

గత వారం ఉదయ్ పూర్ లో రంగ రంగా వైభవంగా పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నీహారిక, తన భర్త చైతన్యతో కలిసి ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి వచ్చిన కొత్త దంపతులు, స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై వీరికి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

ఆలయం వెలుపల వీరిని చూసేందుకు యాత్రికులు ఆసక్తి చూపారు. ఈ నెల 9న వీరిద్దరి వివాహం జరుగగా, ఆపై 11న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Advertisement