Advertisement

నిహారిక పెళ్లిపై స్పందించిన నాగబాబు

By: Sankar Thu, 02 July 2020 3:53 PM

నిహారిక పెళ్లిపై స్పందించిన నాగబాబు



ఇటీవల కాలంలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి అన్న విషయం తెలిసిందే ..ఇప్పటికే రానా , నితిన్ , నిఖిల్ వంటి సెలెబ్రిటీలు బాచిలర్స్ నుంచి పెళ్లి జీవితంలోకి అడుగుపెడుతున్నారు ఇప్పుడు ఆ జాబితాలో నిహారిక కూడా చేరింది అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న అయిన నాగబాబు ఇంట్లో పెళ్లి అంటే సహజంగానే మెగా అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది .

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి నాగబాబు ఆసక్తికరంగా స్పందించారు. ''సురేష్ బాబు గారు రానా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు?'' అని యాంకర్ వేసిన ప్రశ్నకు బదులిచ్చిన నాగబాబు.. 'అది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు' నిశ్చితార్థం అయ్యాక అన్నీ చెబుతా అన్నారు.

త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని ఆయన చెప్పడం గమనార్హం. అయితే కరోనా కారణంగా అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు.

Tags :

Advertisement