Advertisement

  • మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు ఫిక్స్ అయిన ముహూర్తం

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు ఫిక్స్ అయిన ముహూర్తం

By: Sankar Wed, 04 Nov 2020 5:08 PM

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు ఫిక్స్ అయిన ముహూర్తం


మెగా ఫ్యామిలీ ఇంట త్వరలో పెళ్లిబాజాలు వినిపించనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి త్వరలో జరగనుంది.

నిహారిక నిశ్చితార్ధం ఆగస్టు 13 రాత్రి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక ఎంగేజ్‌మెంట్ పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగింది.ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలి మినహా సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరూ హాజరు కాలేదు.తాజాగా నిహారిక పెళ్లికి ముహర్తం ఖరారు అయ్యింది.

డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసారు ఇరు కుటుంబసభ్యులు. రాజస్థాన్ ఉదయపూర్ లోని ఉదయ విలాస్ లో వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు అవుతారని తెలుస్తుంది.

Tags :

Advertisement