Advertisement

  • మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ ..

మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ ..

By: Sankar Wed, 29 July 2020 11:13 AM

మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ ..



మెగాబ్రదర్‌ నాగ‌బాబు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ప్రభాకర్‌రావు త‌న‌యుడు చైత‌న్యతో జ‌రగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని చెబుతూ కొన్ని రోజుల క్రితం నిహారిక త‌నకు కాబోయే భ‌ర్తను సోషల్‌ మీడియా ద్వారా అంద‌రికీ ప‌రిచ‌యం చేసేసింది. వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు సైతం ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నాగబాబు త‌న‌యుడు, హీరో వ‌రుణ్ తేజ్ నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేశారు. ఆయన మాట్లాడుతూ ఆగ‌స్టు 13న ఇరు కుటుంబాల పెద్దల స‌మ‌క్షంలో చైత‌న్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని తెలిపారు.

అయితే ఈ కరోనా కాలంలో టాలీవుడ్ యువ నటులు అందరు ఇంటివారు అవుతున్న విషయం తెలిసిందే ..కరోనా ఉన్న కారణంగా సింపుల్ గా మ్యారేజ్ ను కానిచ్చేస్తున్నారు ..ఇప్పటీకె యువ హీరో నిఖిల్ పెళ్లి అవ్వగా , తాజాగా మరో యువ హీరో నితిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కాడు ..ఇక మరోవైపు రానా కూడా తన పెళ్లి పనులలో బిజీ గా ఉన్నాడు ..ఇక ఇప్పుడు నిహారిక వంతు వచ్చింది ..

Tags :
|

Advertisement