Advertisement

‘మాస్టర్’ సినిమా టీజర్‌ దీపావళి కానుక...

By: chandrasekar Fri, 13 Nov 2020 12:20 PM

‘మాస్టర్’ సినిమా టీజర్‌ దీపావళి కానుక...


దీపావళి రోజు దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కు సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్నాడు. నవంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘మాస్టర్’ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు విజయ్ సేతుపతి, విజయ్ కలిసున్న పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ మూవీకి బాణీలు సమకూరుస్తున్నాడు.

వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అలాగే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. విజయ్ ఫ్యాన్స్‌ కోరిక మేరకు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement