Advertisement

  • మెగాస్టార్ చంటబ్బాయి లాంటి పాత్రతో అలరించనున్న మాస్ మహారాజ్ ..

మెగాస్టార్ చంటబ్బాయి లాంటి పాత్రతో అలరించనున్న మాస్ మహారాజ్ ..

By: Sankar Fri, 24 July 2020 4:40 PM

మెగాస్టార్ చంటబ్బాయి లాంటి పాత్రతో అలరించనున్న మాస్ మహారాజ్ ..



టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నడు ..సోలోగా కస్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకడిగా స్థానం సంపాదించి అభిమానుల గుండెల్లో మాస్ మహారాజ్ గా చెరగని ముద్ర వేసుకున్న రవితేజ సినిమా అంటే ఎంట‌ర్‌టైన్ మెంట్ ఉండాల్సిందే. త‌న‌దైన యాక్ష‌న్‌, కామెడీ ట్రాక్ తో అభిమానుల‌ను అల‌రించే ర‌వితేజ‌..ప్ర‌స్తుతం క్రాక్ సినిమాలో న‌టిస్తున్నాడు..

గోపిచంద్ మ‌లినేని, ర‌వితేజ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్పటికే రవితేజ శృతి హాసన్ , గోపీచంద్ కంబినేషన్లోసూపర్ హిట్ చిత్రం బలుపు వచ్చింది ..మల్లి అదే రిపీట్ చేయాలనీ రవితేజ పట్టుదలతో ఉన్నారు .. మ‌రోవైపు రానాతో రీమేక్ చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌రో ఆస‌క్తిక‌ర వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

నేను లోక‌ల్ ఫేం త్రినాథ రావు న‌క్కిన డైరెక్ష‌న్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి కెరీర్ లో ప్ర‌త్యేక చిత్రంగా నిలిచిన చంట‌బ్బాయి..కామెడీ, సీరియ‌స్ డిటెక్టివ్ వెర్ష‌న్ లో సాగుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఇపుడు ర‌వితేజ కూడా చిరంజీవి త‌ర‌హాలో కామెడీ ట‌చ్ ఉన్న డిటెక్టివ్ త‌ర‌హాలో వినోదాన్ని అందించ‌నున్నాడ‌ని టాక్‌. ఇదే నిజ‌మైతే ర‌వితేజ నుంచి మ‌రో ఎంట‌ర్ టైన‌ర్ రెడీగా ఉంద‌న్న‌మాట‌.

Tags :

Advertisement