Advertisement

  • వీసా సులభంగా వస్తుందని పెళ్లిచేసుకున్న నటి

వీసా సులభంగా వస్తుందని పెళ్లిచేసుకున్న నటి

By: chandrasekar Mon, 26 Oct 2020 5:01 PM

వీసా సులభంగా వస్తుందని పెళ్లిచేసుకున్న నటి


చాలామంది తమ పెళ్ళికి ఒక్కో కారణం చెపుతుంటారు. కానీ ఒక నటి ఏమో వీసా కోసం పెళ్లి చేసుకుందట. ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తుంటుంది నటి రాధికా ఆప్టే. సినిమాల్లో క్యారెక్టర్లలాగే ఆమె మాటలు కూడా బోల్డ్‌గా ఉంటాయి.

మన టాలీవుడ్ లో రక్తచరిత్ర, ధోనీ, లెజెండ్, లయన్ చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమై పోయింది. 2012లో బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ బెనెడిక్ట్‌ను వివాహమాడిన రాధికా భర్తతో కలిసి లండన్‌లో స్థిరపడింది. అయినప్పటికీ సినిమా కెరీర్‌ కోసం ఎక్కువగా భారత్‌లోనే ఉంటోంది.

ఈ హీరోయిన్ తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే. తనకు పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని చెప్పింది.

కానీ పెళ్ళైన తరువాత ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేదని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని వెల్లడించింది. మరి ఆమె భర్త దగ్గర అడిగితే అతను ఏమి కారణం చెపుతాడో.

Tags :
|
|

Advertisement