Advertisement

విజయానికి మరోపేరు వెంకటేష్ ...

By: Sankar Sun, 13 Dec 2020 08:45 AM

విజయానికి మరోపేరు వెంకటేష్ ...


తెలుగులో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు , కృష్ణం రాజు ల శకం తర్వాత తెలుగులో మరొక నాలుగు హీరోల హావ మొదలయింది..వారే మెగాస్టార్ చిరంజీవి , యువరత్న బాలకృష్ణ , యువ సామ్రాట్ నాగార్జున ఇక మరొకరు వెంకటేష్...దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి వరుసగా విజయాలతో విక్టరీ నే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్...ఈ నలుగురు తెలుగు సినిమాకు నాలుగు కళ్లుగా భావిస్తున్న రోజుల్లో నలుగురిలో వెంకటేష్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు..అదే విమెన్ ఫాలోయింగ్ ..

తెలుగు సినీమా చరిత్రలో శోభన్ బాబు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విమెన్ , ఫామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు వెంకటేష్ ..ఒకవైపు బొబ్బిలిరాజా వంటి సినిమాలు చేస్తూనే మరోవైపు చంటి వంటి సినిమాలు కూడా చేస్తూ విలక్షణ నటనతో అభిమానులను అలరించాడు..ఇక 2000 తర్వాత పూర్తిగా ఫ్యామిలీ , కామెడీ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్న వెంకటేష్ అందులో కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు..

ఇక ప్రస్తుతం మల్టీ స్టార్రర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వెంకటేష్...మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వంటి ఈ తరం సూపర్ స్టార్ లతో మల్టీ స్టారర్ సినిమాలు చేసిన వెంకీ , రామ్ , చైతన్య వంటి యువ హీరోలతో కూడా సినిమాలు చేసాడు... ఇక ఇప్పటివరకు 73 సినిమాలు చేశాడు. 74 వ సినిమా నారప్ప షూటింగ్ జరుపుకుంటోంది. పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్.ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వెంకటేష్ కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు...

Tags :

Advertisement