Advertisement

  • సత్య సినిమా నా జీవితాన్నే మార్చేసింది ..మనోజ్ బాజ్‌పేయి

సత్య సినిమా నా జీవితాన్నే మార్చేసింది ..మనోజ్ బాజ్‌పేయి

By: Sankar Fri, 03 July 2020 4:07 PM

సత్య సినిమా నా జీవితాన్నే మార్చేసింది ..మనోజ్  బాజ్‌పేయి



తెలుగు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడంటే నా సినిమాలు నా ఇష్టం అని తనకు తోచిన సినిమాలు చేస్తున్నప్పటికీ , ఒకప్పుడు ఇండియాలో అగ్ర దర్శకుడిగా ఒక వెలుగు వెలిగాడు ..తన తొలి సినిమా శివ తోనే తెలుగు సినిమాలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత వర్మ సొంతం ..1990 లలో వర్మ సినిమా తీసే విధానాన్ని పూర్తిగా మార్చివేసాడు ..కేవలం తెలుగులోనే గాక బాలీవుడ్లో కూడా సంచలన సినిమాలు తీసాడు ..ఆలా తీసిన ఒక సినిమానే సత్య ..

మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి , ఊర్మిళ మండోదకర్ హీరో హీరోయిన్లు గా నటించారు 1998లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ హిట్‌గా నిలిచింది. నటుడు మనోజ్ బాజ్‌పేయి జీవితాన్ని ఈ సినిమా మలుపు తిప్పింది. ఈ సినిమాలో భీకూ పాత్రలో జీవించి ఉత్తమ సహాయనటుడిగా మనోజ్ జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు.

ఈ సినిమా విడుదలై నేటితో 22 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా `సత్య` సినిమాను మనోజ్ గుర్తు చేసుకున్నాడు. నా జీవితం మారిపోయింది. 1998 జులై 3వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేను. `సత్య` సినిమా మొదట్లో ఫ్లాప్ అన్నారు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని ఏకంగా 25 వారాలు ఆడింది` అంటూ ఆ సినిమాకు పనిచేసిన అందరినీ మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాతోనే రైటర్‌గా అనురాగ్ కశ్యప్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగాడు.



Tags :
|

Advertisement