Advertisement

  • జులై 15న తన పుట్టినరోజు సందర్బంగా ముచ్చటించిన మనాలీ రాథోడ్

జులై 15న తన పుట్టినరోజు సందర్బంగా ముచ్చటించిన మనాలీ రాథోడ్

By: chandrasekar Wed, 15 July 2020 3:12 PM

జులై 15న తన పుట్టినరోజు సందర్బంగా ముచ్చటించిన మనాలీ రాథోడ్


హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్ ‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్‌ స్ర్కీన్‌పై మెరిసింది‌. ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఏజీ కాలనీలో ఆమె ప్రాథమిక విద్య సాగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇంటర్ సీఎంఆర్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది.

ఈ పక్కా హైదరాబాదీ అమ్మాయి జులై 15న తన పుట్టినరోజును జరుపుకోనుంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి మనాలీ మీడియాతో ముచ్చటించింది. నేనే నా ప్రతి పుట్టినరోజును ఏదో ఒక అనాథ ఆశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో జరుపుకునేదానిని. అక్కడుంటే మనసుల మధ్య కేక్ కట్ చేసేదాన్ని.

ఈసారి కరోనా వైరస్ కారణంగా బయటికి వెళ్లడం కుదరదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాను. ఒక చిన్నపిల్లల అనాథ శరణాలయంలో వారికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాను. నేను నటి అవ్వడానికి స్ఫూర్తి ‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ సోని అగర్వాల్. నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మా ఇంట్లో జరిగింది. ఆ టైమ్‌లో సోని అగర్వాల్‌ని చూసి నటిని అవుదామనిపించింది.

నాకు ఇండస్ట్రీలో రోల్ మోడల్ మాత్రం విద్యా బాలన్. ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇటీవలే నేను నటించిన ‘రన్’ సినిమా ‘ఆహా’లో విడుదలైంది. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ నిర్మించగా లక్ష్మీకాంత్ చెన్న డైరెక్ట్ చేశారు. 2019 నవంబర్‌లో విజిత్‌ను వివాహం చేసుకున్నాను. ఆయన బీజేపీ యూత్ లీడర్. మాది పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. మ్యారేజ్ లైఫ్ బాగుంది. నేను నటించిన ఒక తమిళ్ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో కొందరు దర్శకులు అప్రోచ్ అయ్యారు. త్వరలో వాటి వివరాలు చెబుతాను.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, క్రిష్ దగ్గర వర్క్ చేయాలని ఉంది. ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ టచ్‌లో ఉన్నారు. యాక్టర్ నవీన్ నేనీ నాకు బెస్ట్ ఫ్రెండ్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికీ బయటికి వెళ్లొద్దు. కరోనా రోజు రోజుకు బాగా పెరుగుతుంది. అయినా సరే కొందరు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను పాటించాలి అని మనాలీ రాథోడ్ చెప్పారు.

Tags :
|

Advertisement