Advertisement

  • నెటిజ‌న్ కామెంట్‌కు మ‌ల‌యాళీ న‌టి ఇచ్చిన సీరియ‌స్ వార్నింగ్

నెటిజ‌న్ కామెంట్‌కు మ‌ల‌యాళీ న‌టి ఇచ్చిన సీరియ‌స్ వార్నింగ్

By: chandrasekar Fri, 12 June 2020 7:09 PM

నెటిజ‌న్ కామెంట్‌కు మ‌ల‌యాళీ న‌టి ఇచ్చిన సీరియ‌స్ వార్నింగ్


సోష‌ల్ మీడియాలో ఓ నెటిజ‌న్ కామెంట్‌పై మ‌ల‌యాళీ న‌టి అప‌ర్ణా నాయ‌ర్ హ‌ర్ట్ అయ్యారు. ఆమె మ‌న‌సు ఎంత‌గా బాధ ప‌డుతున్న‌దో తెలుసుకోవాలంటే అప‌ర్ణా తిరిగి ఇచ్చిన కౌంట‌ర్ ఏ రేంజ్‌లో ఉందో గ‌మ‌నించాలి. మ‌ల‌యాళీ న‌టి ఇచ్చిన సీరియ‌స్ వార్నింగ్ గురించి తెలుసుకున్న త‌ర్వాత మ‌రెవ‌రూ అడ్డ‌మైన కామెంట్ పెట్ట‌డానికి సాహ‌సించ‌రు. మ‌ల‌యాళీ న‌టి అప‌ర్ణా నాయ‌ర్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. త‌న కెరీర్‌కు సంబంధించిన విష‌యాల‌ను అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటుంటారు. ఇందులో భాగంగా ఆమె త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై అజిత్‌కుమార్ అనే ఆక‌తాయి నెటిజ‌న్ ఐ ల‌వ్ యూ అంటూ కామెంట్ పెట్టాడు.

ఇది చుసిన అప‌ర్ణా నాయ‌ర్‌కు చిర్రెత్తుకొచ్చింది. మ‌న‌సు విక‌ల‌మైన ఆమె స‌ద‌రు నెటిజ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఆ నెటిజ‌న్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేశారు. "నేను కూడా ఒక‌రికి కూతురినే అని గుర్తు పెట్టుకోండి" అని ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. ఈ ఒక్క మాట‌తో ఆమె విడిచిపెట్ట‌డ‌లేదు. మొత్తం అత‌ని వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా బ‌య‌ట పెట్టి చీవాట్లు పెట్టారు. ఆమె ఇంకా ఏమ‌న్నారో తెలుసుకుందాం.

"ఒక‌వేళ నేను ఇలాంటి కామెంట్స్‌పై స్పందించ‌క‌పోతే మీరు మ‌రోలా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో క్ష‌మించ‌ను. డియ‌ర్ అజిత్‌కుమార్ మీ ప్రొఫైల్ చూస్తే మీకూ ఒక కూతురు ఉంద‌ని అర్థ‌మైంది. మీరు మీ కుమార్తెను ప్రేమ‌గా ఆలింగ‌నం చేసుకున్న ఫొటోను చూశాను. అదే విధంగా నేను కూడా ప్రేమ‌గా త‌న హృద‌యానికి హ‌త్తుకున్న ఓ వ్య‌క్తికి కూతుర్నే. ఇలాంటి అస‌భ్య‌క‌ర కామెంట్స్ పెట్టే ముందు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి" అంటూ త‌న ఆవేద‌న‌, ఆగ్ర‌హాన్ని ఆమె వెళ్ల‌గ‌క్కారు. ఒక మాట మాట్లాడే ముందు, కామెంట్ పెట్ట‌డానికి ముందు చాలా జాగ్ర‌త్త‌గా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల‌నే విష‌యాన్ని న‌టి అప‌ర్ణా అనుభ‌వం హెచ్చ‌రిస్తోంది. ఎదుటి వాళ్ల హృద‌యాల‌ను గాయ‌ప‌రచ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌.

Tags :

Advertisement