Advertisement

  • నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు మలయాళ చిత్ర నిర్మాతలు సమావేశం

నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు మలయాళ చిత్ర నిర్మాతలు సమావేశం

By: chandrasekar Sat, 06 June 2020 7:02 PM

నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు మలయాళ చిత్ర నిర్మాతలు సమావేశం


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. దీన్ని అదిగమించేందుకు మలయాళ చిత్ర నిర్మాతలు ఈ రోజు సమావేశం అయ్యారు. నష్టాలు తగ్గించుకునేందుకు సినిమా నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి తిరిగి త్వరగా సంపాదించుకునేందుకు నిర్మాణ వ్యయం సగం తగ్గించడం మాత్రమే మార్గమని నిర్ణయించారు.

నిర్మాతల సంఘం సమావేశం తరువాత సంఘ నాయకుడు రెంజిత్‌ మీడియాతో మాట్లాడుతూ మేము త్వరలోనే అన్ని ఇతర చిత్ర సంస్థలతో మా సమస్యలను పంచుకుంటాము, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో వారికి కూడా తెలుసు, ఈ పరిశ్రమ ముందుకు సాగాలంటే బడ్జెట్‌ తగ్గించడం తప్ప వేరే మార్గం లేదు అని అన్నారు. కేరళ చిత్ర పరిశ్రమలో అమ్మా (నటీనటుల సంఘం), ఎఫ్‌ఈఎఫ్‌కేఏ(లైట్‌ బాయ్స్‌ నుంచి డైరెక్టర్స్‌ వరకు పరిశ్రమలోని అన్ని విభాగాల సభ్యుల సంఘం) డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్‌ వటి సంఘాలు ఉన్నాయి. 2019 లో కేవలం ఆరు సినిమాలు థియేటర్లో‌ విడుదల అయి లాభాలను ఆర్జించగలిగాయి. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి అవకాశం లేదు కాబట్టి వ్యయాన్ని తగ్గించవలసిన అవసరం ఉందన్నారు.

Tags :

Advertisement