Advertisement

  • వ‌ర్మ‌ను ప‌రేషాన్ చేయాల‌ని చూస్తున్న మేక‌ర్స్ ప్లాన్స్

వ‌ర్మ‌ను ప‌రేషాన్ చేయాల‌ని చూస్తున్న మేక‌ర్స్ ప్లాన్స్

By: chandrasekar Sat, 25 July 2020 08:31 AM

వ‌ర్మ‌ను ప‌రేషాన్ చేయాల‌ని చూస్తున్న మేక‌ర్స్ ప్లాన్స్

రాంగోపాల్ వర్మ ‌పైనే సినిమాలు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయాల‌ని కొంద‌రు మేక‌ర్స్ భావిస్తున్నారు. ఎప్పుడు అంద‌రిని గిల్లే వ‌ర్మ‌పై ఈ సారి రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఆర్జీవీ లోపాల‌ని ఎండ‌గ‌డుతూ నాలుగు సినిమాల‌ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే జొన్నవిత్తుల ఆర్జీవీ పేరుతో బయోపిక్ చేస్తుండ‌గా, అందులో శ‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. నూత‌న్ నాయుడు తెర‌కెక్కిస్తున్నారు. ఆర్ జీ వీ అంటే రోజు గిల్లే వాడు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇక కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్మ‌కి వ్య‌తిరేఖంగా ప‌రాన్న‌జీవి అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.

ఇందులో సాంగ్స్ కూడా ఒక్క‌క్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు త్వ‌ర‌లో డేరా బాబా మరియు వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్ ఆర్జీవీ అనే పేర్ల‌తో సినిమాలు విడుద‌ల కానున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

మొత్తానికి వ‌ర్మ‌ స్టైల్‌లోనే వెళుతూ ఆయ‌న‌ని ప‌రేషాన్ చేయాల‌ని చూస్తున్న మేక‌ర్స్ ప్లాన్స్ ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతాయో చూడాలి.

Tags :
|
|
|

Advertisement