Advertisement

  • కరోనా కారణంగా మహేష్‌బాబుకు తగ్గిన పారితోషికం

కరోనా కారణంగా మహేష్‌బాబుకు తగ్గిన పారితోషికం

By: chandrasekar Wed, 24 June 2020 5:35 PM

కరోనా కారణంగా మహేష్‌బాబుకు తగ్గిన పారితోషికం


కరోనా తో టాలీవుడ్‌లో స్టార్‌హీరోల పారితోషికంలో కోత పడుతుంది. సాధారణంగా హీరో మహేష్‌బాబు తన సినిమాలకు వచ్చే శాటిలైట్‌ హక్కుల మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా తీసుకోవడంతో పాటు నిర్మాణ భాగస్వామ్యంలో కూడా పాలు పంచుకుంటూ 45 కోట్ల నుండి 50 కోట్ల వరకు గిట్టుబాటు చేసుకుంటాడు.

అయితే ఇప్పుడు ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు పారితోషికం వాటా మారినట్లు తెలిసింది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్‌ మొత్తాన్ని మైత్రీమూవీస్‌ భరించి, సినిమా బిజినెస్‌ క్లోజ్‌ అయిన తర్వాత వడ్డీతో సహా బడ్జెట్‌ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన వాటాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

మహేష్‌బాబు ఎమ్‌బీ కార్పోరేషన్‌, అనీల్‌సుంకర, మైత్రీమూవీస్‌ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఈలెక్క ప్రకారం చూస్తే మహేష్‌బాబుకు 35 కోట్ల పారితోషికం మాత్రమే దక్కనుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Advertisement