Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు తో అనుష్క...!

By: Anji Tue, 24 Nov 2020 07:25 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తో అనుష్క...!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఫిలిం సర్కిల్లో సినిమాకు సంబందించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం గాను స్వీటీ అనుష్కను తీసుకుంటున్నారని.

కానీ అసలు విషయంలోకి వెళ్తే అసలు ఇందులో ఎలాంటి నిజమూ లేదని అది ఫేక్ వార్త అని తేలింది. కేవలం అటెన్షన్ కోసమే కొందరు నెటిజన్స్ ఇలా చేస్తున్నారని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

Tags :

Advertisement