Advertisement

  • సరిలేరు నీకెవ్వరూ ..ట్విట్టర్లో మహేష్ బాబు సరికొత్త రికార్డు

సరిలేరు నీకెవ్వరూ ..ట్విట్టర్లో మహేష్ బాబు సరికొత్త రికార్డు

By: Sankar Thu, 02 July 2020 7:17 PM

సరిలేరు నీకెవ్వరూ ..ట్విట్టర్లో మహేష్ బాబు సరికొత్త రికార్డు


తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..కేవలం తెలుగులోనే గాక సౌత్ ఇండియా మొత్తం లో మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు ..ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో మహేష్ ఒకరు ..తెలుగులో అయితే మహేష్ ను మించిన అందగాడు లేడు ..సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులతో టచ్ ఉండే ఈ సూపర్ స్టార్ ..ఫాలోయర్స్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించాడు ..

తాజాగా ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా అరుదైన ఫీట్ సాధించి దక్షిణాది తారల్లో టాప్ స్టార్‌గా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు.ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, సినిమా విశేషాలే కాకుండా సామజిక అంశాలపై కూడా మహేష్ బాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయనను సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్‌గా మారిపోయారు. దీంతో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లు దాటింది.

దీంతో దక్షిణాది సినీ తారల్లో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన వ్యక్తిగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది. దక్షిణాది సినీ తారల పరంగా మహేష్ తర్వాత కమల్ హాసన్ 6.1 మిలియన్లు, రజనీకాంత్ 5.7 మిలియన్లు, అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, జూనియర్ ఎన్టీఆర్‌ 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో కొనసాగుతున్నారు.

Tags :

Advertisement