Advertisement

  • సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ అవసరం లేదు ..మహారాష్ట్ర హోంమత్రి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ అవసరం లేదు ..మహారాష్ట్ర హోంమత్రి సంచలన వ్యాఖ్యలు

By: Sankar Fri, 17 July 2020 7:53 PM

సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ అవసరం లేదు ..మహారాష్ట్ర హోంమత్రి సంచలన వ్యాఖ్యలు



బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపైన రోజుకొక కొత్త వార్తలు వస్తున్నాయి ..ఆయన చనిపోయి నెల దాటినా కూడా ఇంకా చాలా మంది ఆయన లేరు అన్న విషయాన్నీ నమ్మలేకపొతున్నారు ..చాల కెరీర్ ఉండి, స్టార్ స్టేటస్ ఉన్న నటుడు ఇలా అర్దాంతరంగా కన్ను మూయడం మీద అనేక మంది అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు ..

అయితే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్ధంగా దర్యాప్తు చేధిస్తారని అన్నారు. సుశాంత్‌ విషాదాంతం కేసులో వ్యాపార శత్రుత్వ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. సుశాంత్‌ రాజ్‌పుట్‌ జూన్‌ 14న ముంబైలో తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ కేసును పోలీసులు ఆత్మహత్యగా పేర్కొనగా ప్రాథమిక దర్యాప్తులో బాలీవుడ్‌ యువనటుడు కుంగుబాటుకు లోనై చికిత్స పొందుతున్నారని వెల్లడైంది. కాగా, సుశాంత్‌ ఎలాంటి పరిస్ధితిలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారో, ఎంతటి ఒత్తిడికి గురయ్యారో నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సీబీఐ విచారణ ద్వారా ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.





Tags :
|
|

Advertisement