Advertisement

  • దిగ్గజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ను గుర్తుచేసుకున్న మాధురి దీక్షిత్

దిగ్గజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ను గుర్తుచేసుకున్న మాధురి దీక్షిత్

By: Sankar Sun, 12 July 2020 7:04 PM

దిగ్గజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ను గుర్తుచేసుకున్న మాధురి దీక్షిత్



‘దేవదాస్‌’ చిత్రం విడుదలై 18 సంవత్సరాలు అయిన సందర్భంగా దివంగత కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ను గుర్తు చేసుకున్నారు సినీనటి మాధురీ దీక్షిత్‌. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టులో సరోజ్‌ఖాన్‌ పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. తనకు ‘మార్‌ దాలా’ పాటకు కొరియోగ్రఫి ఎలా చేసిందో గుర్తు చేసుకున్నారు. 'ఈ రోజు దేవదాస్ 18వ సంవత్సరం, నేను ఈ చిత్రంలో నా అత్యుత్తమ నృత్య ప్రదర్శనల వెనుక ఉన్న శక్తికి అంకితమిస్తున్నా.’ ఆమెతో ఏ పాట నైనా షూట్ చేయడం ఎప్పటిలాగే చాలా గొప్పగా ఉండేది.

ఈ సినిమాలో అన్ని పాటలు చాలా గ్రాండ్‌గా ఉండడ వల్ల 'దేవదాస్' చాలా స్పెషల్‌గా ఉండేది. నేను ఆమెతో ఇలాంటి పాట ఎప్పుడూ చేయలేదు. మేం చాలా భారతీయ పాటలు చేశాము. కానీ అలాంటి డ్యాన్స్ చేయలేదు. సరోజ్‌ఖాన్‌ ఒక సెమీ క్లాసికల్ డాన్సర్. 'ఇది కొద్దిగా కథక్ స్టైల్.. జాగ్రత్త వహించండి' అని ఆమె చెప్పేది. ఆమె ఈ రోజు మాతో లేదు, కానీ ఇవి నేను ఎప్పుడూ గుర్తుంచుకునేవి , అంటూ మాధురి ఇస్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

కాగా ఇటీవల అనారోగ్య కారణాల వాళ్ళ దిగ్గజ బాలీవుడ్ నృత్య దర్శకురాలు అయిన సరోజ్ ఖాన్ గారు మరణించిన విషయం తెలిసిందే ..ఎన్నో అద్భుతమైన పాటలకు తన డాన్స్ మూమెంట్స్ తో మరుపురాని పాటలుగా తీర్చి దిద్దారు ..తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి డాన్స్ స్టప్స్ కంపోజ్ చేసారు ..ఈమె మృతికి ఇండియన్ సినీ పరిశ్రమ అంత సంతాపం తెలిపింది ..

Tags :

Advertisement