Advertisement

  • ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ ఇంట తీవ్ర విషాదం ...

ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ ఇంట తీవ్ర విషాదం ...

By: Sankar Mon, 28 Dec 2020 2:48 PM

ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ ఇంట తీవ్ర విషాదం ...


ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ తల్లి కరీమా బేగమ్ అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ప్రముఖ సంగీత కళాకారుడు శేఖర్ కుమారుడైన దిలీప్... రెహమాన్ గా మారడానికి అతని తల్లి కమల కారణం.

అనారోగ్యంతో శేఖర్ కన్నుమూసిన తర్వాత దిలీప్ మ్యూజిక్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టడానికి, అలానే అతను సూఫీయిజాన్ని స్వీకరించడానికి వెనుక ఆమె ప్రోత్సాహమే ఉంది. భర్త అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె సూఫీయిజం ద్వారా స్వాంతన పొందింది.

తన పేరును కరీమా బేగమ్ గా మార్చుకోవడంతో పాటు కుమారుడు దిలీప్ పేరును అల్లా రఖా రెహమాన్ గా మార్చింది. శేఖర్ కన్నుమూసిన పదేళ్ళ తర్వాత వీరి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. తల్లిని కోల్పోయిన రెహమాన్ కు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags :
|

Advertisement