అమలాపాల్ బాలయ్య సరసన నటించనున్నారని తాజా వార్త
By: chandrasekar Mon, 06 July 2020 10:54 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇది బాలకృష్ణ 106వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘మోనార్క్’, ‘సూపర్
మ్యాన్’ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని ద్వారకా
క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ తప్ప
ఇతర పాత్రధారులు ఎవరనే విషయంపై అధికారిక ప్రకటనలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు
ఉంటారని చిత్ర వర్గాల సమాచారం. ఈ ఇద్దరిలో ఒక కొత్త హీరోయిన్‌కు చోటుందట. ఇక మరో
హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేశారనే విషయంలో ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి.
హీరోయిన్ అంజలి పేరును కూడా బోయపాటి శ్రీను పరిశీలించారని సమాచారం.
అయితే ప్రముఖ నటి
అమలాపాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటించనున్నారని తాజా వినిపిస్తోన్న వార్త. ఇది
సినిమాకు చాలా కీలకమైన పాత్ర కావడంతో అమలాపాల్‌ను బోయపాటి సంప్రదించారట. ఆమెకు కథ
నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపేసారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన
వస్తుందట. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైన విషయం తెలిసిందే. రామోజీ
ఫిల్మ్ సిటీలో బాలకృష్ణపై ఒక ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఇదే సన్నివేశంలోని కొన్ని
క్లిప్స్‌తో చిన్న టీజర్‌ను కూడా వదిలారు. ఈ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.
కరోనా వైరస్ కారణంగా ఈ
సినిమా షూటింగ్ వాయిదా పడింది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తరవాత
అంటే ఈ ఏడాది ఆఖరిలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా కావడంతో
భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను అద్భుతంగా
తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు.