Advertisement

  • సుశాంత్ సింగ్ గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన కృతి సనన్ ..

సుశాంత్ సింగ్ గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన కృతి సనన్ ..

By: Sankar Mon, 27 July 2020 2:53 PM

సుశాంత్ సింగ్ గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన కృతి సనన్ ..



బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు కావొస్తున్నఇంకా చాలా మంది ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు ..తాజాగా సుశాంత్ నటించిన చివరి చిత్రం అయిన దిల్ బేచారా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ..ముఖ్యంగా సుశాంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంది అని ప్రశంసలు వస్తున్నాయి ...

తాజాగా కృతిసనన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. సినిమా చూశాక తన మనసు మరోసారి విరిగిందని పోస్టు చేసింది. మ్యానీ పాత్ర చూస్తుంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అనిపిస్తుంది. స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా బతికే ఉన్నావు అనిపిస్తుంది అని కృతి ఆవేదనతో పోస్టు పెట్టింది.

ఏ సినిమాలో అయినా పాత్ర కోసం సుశాంత్ ఎంతగా ఇన్వాల్వ్ అవుతావో తనకు తెలుసంది కృతి. నీ మౌనం కూడా ఎన్నో విషయాలని చెబుతుంది అంటూ కృతి ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టింది. దర్శకుడు ముఖేష్ చాబ్రా గురించి మాట్లాడుతూ మీ మొదటి సినిమాతోనే మమ్మల్ని భావోద్వేగానికి గురి అయ్యేలా చేశావన్నారు. ఈ సినిమా ఆయనకు ఎంత స్పెషల్ అన్నది తనకు తెలుసన్నారు. సంజనా సంఫీుకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా శుభాకాంక్షలు తెలిజేసింది కృతిసనన్..

Tags :
|

Advertisement