Advertisement

  • నిహారిక-చైతన్య వివాహం... మాటిచ్చిన పవన్ కల్యాణ్...!

నిహారిక-చైతన్య వివాహం... మాటిచ్చిన పవన్ కల్యాణ్...!

By: Anji Fri, 20 Nov 2020 12:39 PM

నిహారిక-చైతన్య వివాహం... మాటిచ్చిన పవన్ కల్యాణ్...!

మెగాడాటర్ నిహారిక పెళ్లి చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిహారిక వివాహం జరగబోతోంది.

దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను నాగబాబు కుటుంబం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఇక ఇటీవలే నిహారిక కూడా అక్కడికి వెళ్లింది.

ఇక నిహారిక పెళ్లి కోసం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ రెండు రోజుల ముందు ఉదయ్‌పూర్‌కి వెళ్లనున్నారట. తన పెళ్లి కోసం నిహారిక తన బాబాయ్‌ని పవన్‌ని పర్సనల్‌గా ఇన్వైట్‌ చేసిందట.

ఈ క్రమంలో పెళ్లికి రావడమే కాదు, ఆ పనుల్లో తాను భాగం పంచుకుంటానని పవన్‌, నిహారికకు హామీ ఇచ్చారట. ఈ క్రమంలో రెండు రోజులు ముందుగానే పవన్‌ అక్కడికి వెళ్లనున్నారట.

అలాగే ఫ్యామిలీ కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నారట. కాగా మరోవైపు నిహారిక పెళ్లి నేపథ్యంలో చిరంజీవి సహా మెగా హీరోలందరూ తమ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే నిహారిక కోసం వారు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement