Advertisement

  • నిహారిక పెళ్లి బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే...!

నిహారిక పెళ్లి బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే...!

By: Anji Fri, 06 Nov 2020 5:34 PM

నిహారిక పెళ్లి బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే...!

నిహారిక పెళ్లి బడ్జెట్ విషయానికి వస్తే కొణిదెల ఫ్యామిలీ దగ్గరి బంధువులు 70 మందికి పైగా పెళ్లి వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత వరకు పెళ్లికి ముందు క్వారంటైన్ లోనే ఉండాలని అనుకుంటున్నారట. ఇక పెళ్లికి 7కోట్ల పైగానే ఖర్చు అవుతోందట. ప్యాలెస్ కు ఒక స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఖర్చు మొత్తం వరుణ్ తేజ్ పైనే పడుతోందట. ఒక్క గానొక్క చెల్లి పెళ్లి తన చేతుల మీదుగా జరగాలని తండ్రిపై భారం పడకుండా పెళ్లి ఖర్చును తనపైనే వేసుకున్నాడట.

హోటల్ సెలక్షన్ నుంచి అప్పగింతల వరకు అలాగే పెళ్లి అనంతరం జరిగే కార్యక్రమాలన్నిటి ఒక బడ్జెట్ అయితే రెడీ చేసుకున్నట్లు తాజ్ వస్తోంది.

ఇక పెళ్లికి టాలీవుడ్ సెలబ్రెటీలు పెద్దగా హాజరు కాకపోవచ్చు. కేవలం మెగా ఫ్యామిలీ దగ్గరి బంధువులు సన్నిహితులు మాత్రమే వస్తారట. అందుకే పెళ్లి అనంతరం టాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ గా రిసెప్షన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ప్లాన్ రెడీ అయ్యింది. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి 10రోజుల ముందే రాజస్థాన్ వెళ్లనున్నట్లు సమాచారం.

Tags :

Advertisement